కృష్ణుణ్ణి తలుస్తేనే –
జగత్తంతా ‘ ఆడతనం ’ పరచు కొంటుంది .
‘ మథుర భక్తి ‘ మనోఙ్ఞమై విరుచు కుంటుంది .
జగన్నాధుని ఆరాధనతో ‘ మనోనేత్రం’ తెరుచు కుంటుంది .
కృష్ణుని పేరు వింటేనే –
జగత్తుకు ‘ భగవద్గీత ’ విన్పిస్తుంది .
‘ అధర్మంపై ’ ధర్మ పోరాటం మొదలౌతుంది .
ఆర్తులకు జగన్నాధుని ‘ ఆశ్రయం ’ లభిస్తుంది .
కృష్ణుని రూప లావణ్యం చూస్తేనే –
జగత్తులోని ‘ అందమంతా ’ కళ్ళకు కట్టినట్లు
కనబడుతుంది .
ఆత్మకు ‘ అనిర్వచనీయమైన ’ ఆనందం కల్గుతుంది .
జన్మాంతర దు:ఖాలకు ‘ విముక్తి ’ లభిస్తుంది .
‘ మోవి ’ తాకిన ‘ క్రోవి ’ మోహనరాగ మాలపిస్తుంటే
ప్రకృతి యావత్తూ సమ్మోహిత మైన ఈ వేళ
‘ బృందావన విహారిని ’ స్మరించు కొందాం .
మహాత్ముల సంస్మరణ
మానవ జీవితాలకు
మార్గ దర్శనం చేస్తుంది .
జగన్నాధుని
కని పెంచిన దేవకీ-వసుదేవులనూ , యశోదా-నందులనూ –
కృష్ణ ద్వైపాయణుణ్ణీ , కృష్ణనూ , కృష్ణ
సచివుణ్ణీ –
రాధ , రుక్మిణి , మీరా , జయదేవుడు ,
వామదేవుడు , క్షేత్రయ్య మొదలైన భక్త శిఖా మణులనూ –
కృష్ణుణ్ణి తెలుగు వాకిటికి తెచ్చి ,
ప్రతిష్ఠించిన పోతన్ననూ
కన్నయ్యతో పాటు ‘ జన్మాష్టమి ’ రోజున
స్మరించు కుందాం .
“ కృష్ణం వందే జగద్గురుం “
అవును రాజారావు గారూ!
రిప్లయితొలగించండిమీరన్నవి నిజమే...
ఆ నందనందనుని కీర్తించడం పావన కార్యం...
మీకు కూడా శ్రీకృష్ణాష్టమి శుభాభినందనలు...
@శ్రీ
చక్కగా చెప్పారండి.
రిప్లయితొలగించండివసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం //
శ్రీకృష్ణాష్టమి శుభాకంక్షలండి.
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండీ..
రిప్లయితొలగించండిచాలా చక్కగా చెప్పారండీ... చాలా బాగుంది..
రిప్లయితొలగించండిశ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు....
కృష్ణుని తలిస్తేనే ....అంటూ ఎంత బాగా చెప్పారండీ ...ఆయన చాలు మనకి..!!ఆ కన్నయ్య కటాక్షవీక్షణాలు మీపై ఉండాలని ఆశిస్తూ...
రిప్లయితొలగించండిశ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..:-)
శ్రీనివాస్ గారూ ,
రిప్లయితొలగించండినేటి మీ టపా రాధా మాధవుల ప్రణయ శృంగార కావ్యం .మనసు ఆనందంతో పరవసించింది .
మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు .
ధన్యవాదములు .
భారతిగారూ ,
రిప్లయితొలగించండిఆ జగన్నాధుడే జగద్గరుడు .గీతాచార్యుడు .
జన్మాష్టమి శుభాకాంక్ష లు మీకు .
ధన్యవాదములు .
శ్రీలలిత గారూ ,
రిప్లయితొలగించండిసుజన-సృజన మీకు స్వాగతం పలుకుతోంది .
జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
ధన్యవాదములు .
సీత గారూ ,
రిప్లయితొలగించండికన్నయ్య ఊహలతో మనసు పరవశిస్తుంది .
ఎంత కీర్తించినా తనివి తీరదు .
ఆ కృష్ణుడికీ మీకూ అవినాభావం కదా ,
జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
ధన్యవాదములు .
సాయి గారూ ,
రిప్లయితొలగించండికృష్ణుని సంస్మరణం మహద్భాగ్యం .
జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు .
ధన్యవాదములు .
సర్, మీ కలం నుండి ఏదైనా అద్భుతంగా వికసిస్తుంది.
రిప్లయితొలగించండికాని తక్కువ రాస్తారు ఎందుకో.సర్, నేను పూజించే అక్షరాలూ మీ కాలంలో (గురువుగారి ) కొత్త రూపం పొందుతాయి .
ధన్యవాదాలతో .. మెరాజ్
కలం అని సరిచేసికోవలసినదిగా ప్రార్దన
రిప్లయితొలగించండిఫాతిమా జీ ,
రిప్లయితొలగించండిమీ అభిమానానికీ , తెలుగు భాషపై అద్భుతమైన మమకారానికీ , మహోన్నత సహృదయతా సంస్కారానికీ ధన్యవాదములు .
సర్, కృతజ్ఞతలతో మరో మారు నమస్కరిస్తున్నాను.
రిప్లయితొలగించండి