“ ఏమ్మా ! లక్ష్మీ “ అన్నాడు పలకరింపుగా
ప్రథానోపాధ్యాయుడు, వ్రాసుకొంటున్న వాడల్లా తల పైకెత్తి
గదిలోకి వచ్చిన లక్ష్మి నుద్దేశించి
సమాధానంగా లక్ష్మి కళ్ళ నిండా నీళ్ళు
******************
అది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం . అందులోనే జూనియర్ కళాశాల కూడా
నడుస్తోంది . అప్పుడు లక్ష్మి జూనియర్ ఇంటర్ . ఆ పాఠశాలలోనే పది చదివింది .
లక్ష్మి ఆవూరి అరుంధతీయ వాడ అమ్మాయి . తల్లి దండ్రులకు అనారోగ్యం . అక్కలిద్దరకూ
పెండ్లిండ్లయి వెళ్ళిపోయారు . పదవ తరగతి పరీక్ష తప్పింది . ఇంగ్లీష్ సబ్జెక్ట్
మిగిలి పోయింది . మళ్ళీ మళ్ళీ రాసింది . తన వల్లకాలేదు . ఇల్లు గడవడానికి కూలి
పనులకు వెళ్ళేది .
పరీక్ష ఫీజు కట్టడం – పిలిపించడం ప్రథానోపాధ్యాయులకు షరా మామూలయ్యింది
. ఆ మార్చిలో కూడా పరీక్ష ఫీజు కట్టేడు .
పరాయి ఊళ్లో కూలి పనులకు పోయి ఉంటే పిలిపించి , వారం రోజులు కూచోబెట్టి
పరీక్షకు ప్రిపేర్ చేసి పంపించాడు . లక్ష్మి ఎట్టకేలకు పది పాసయ్యింది .
జూన్లో విద్యాలయాలు ప్రారంభించగానే – పిలిపించి ఫీజు కట్టి ఇంటర్ లో
చేర్పించినాడు . పుస్తకాలు వగైరా ఏర్పాటు చేసినాడు .
*********************
“ అరెరే ! ఏమిటా కన్నీళ్ళు? కళ్లు తుడుచుకొని
విషయం చెప్పు “ అనునయించాడు ప్రథానోపాధ్యాయుడు .
“ రోజూ కాలేజికి రావడం వల్ల ఆదివారం ఒక్కరోజు మాత్రమే కూలి కెల్తున్నాను
. మా నాయనకు రెండొందలు వృధ్ధాప్యపు పింఛను ఇస్తారు . వాటితో గడవడం కష్టంగా ఉంది . ప్రిన్సిపాల్
కు చెప్పండి సార్ “ అంది లక్ష్మి
సంకోచంగా
అంటే వారంలో ఆదివారం కాకుండా ఇంకో రెండు రోజులు కూలి కెళ్ళే అవకాశం
కోసమన్నమాట .
‘ అరెరే వీళ్ళ పరిస్థితి తెలిసీ లక్ష్మిని ఇంటరలో చేర్పించానే, పొరపాటు చేశానా ! అన్పించింది ప్రథానోపాధ్యాయులుకు లిప్తకాలం .
‘ కానే కాదు , తాను చేసింది కరక్టే .
అయితే పరిస్థితిని అధిగమించడమెలా ? ‘
“ లక్ష్మీ ! ఊళ్ళో రేషన్ ఇచ్చే
ముందురా , ఏదో ఒక మార్గం
చూద్దాం , కాలేజీకి మాత్రం మానొద్దు ,
హాజరు కాక పోతే పాఠాలు అర్థం కావు , ఎలాంటి అవసరమైనా నా వద్దకురా అంటూ తక్షణ కుటుంబ అవసరాలకు గాను కొంత
డబ్బిచ్చి పంపించాడు .
**************************
ప్రిన్సిపాల్ , లెక్చరర్ల సహకారంతో ఇంటర్ దగ్విజయంగా పూర్తి చేసింది
లక్ష్మి .
ప్రథానోపాధ్యాయుడు T.T.C (D.ed ) కు అప్లై చేయించాడు
.
టీచర్స్ ట్రయినింగ్ పూర్తయింది .
ఆశ్చర్యంగా ఉందా ?
లక్ష్మి ప్పుడు చదువులమ్మ !
‘ పదిమందికి చదువు చెప్పే పంతులమ్మ . ‘
ఆశీస్సులందిద్దాం లక్ష్మికి .