చెవి నిల్లు గట్టుక ’ సెల్ ఫోను ‘
విడువదు
నిద్దుర చెఱుపక ‘ నెట్టు ‘ విడదు
శ్రీవారు దిట్టక ’ టీవీలు ‘ విడువరు
పది యడుగుల కైన ‘ బండి ‘ విడదు
పన్నెండు దాటినా ‘ పడకలు ‘
పిలువవు
పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
సంతృప్తి యన్నది సుంత లేదు
పనికి రాని ‘
ఇగో
’ లతో
బతుకు నిండి
మనసు , దేహము కృతకమై మారి మనిషి
సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .