“ బ్రతుక
లేనోడురా బడిపంతు ” లను మాట
నాటి
యొజ్జదనపు గీటు రాయి
“ బ్రతుక
నేర్చిన వాడు బడిపంతు “ లను మాట
నేటి
దుర్నీతికి నిలువుటద్ద
మపుడు
పేదరికాన మ్రగ్గు చుండియు గూడ
వృత్తి
ధర్మము దప్ప వేరెరుగరు
మంచి
జీతాలతో మించి జీవించుచున్
వేర్వేరు
పనులందె వేడ్క యిపుడు
ఘన
ముపాథ్యాయ వృత్తి , ఆ గౌర వాని
కెవ్వ
రర్హత పొంది దీపింతురో మ
హానుభావులై ,
వృత్తి ధర్మాను సరణి
వరలు
గురులకు పాదాభి వందనములు .