సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

హర హర మహదేవ ! శంభో శంకర !




ఒల్లంత బూడిద వల్లకాడే యిల్లు
పాము లాభరణాలు భయద రూపు
ఏనుగు తోల్గట్టి యెద్దెక్కి తిరుగుటల్
దేవాధి దేవు డీ తీరు వెలుగు
ఢమరుక నినదాలు ప్రమదుల యరుపులు
శివమెత్తి యాడుటల్ చేష్టితములు
అంగాంగములు లేవు లింగమే రూపము
స్థాణువైనను పేరు జంగమయ్య

తల్లి ! పార్వతీ ! యిట్టి భూతాల మృడుని
మొదలు తుదియును లేని యీ భూత నాధు
నెట్లు భరియించినావు నీకేడ దొరికె ?
విష్ణు బ్రహ్మలు వెర్రులై వెదికి రేల ?


6 కామెంట్‌లు:

  1. తల్లి ! పార్వతీ ! యిట్టి భూతాల మృడుని
    ఎట్లు భరియించినావు నీకేడ దొరికె ?
    మొదలు తుదలును లేని యీ భూత నాధు
    విష్ణు బ్రహ్మలు వెర్రులై వెదుకిరేల ?
    మేనాదేవి అంటుంది!
    అమ్మా! శ్మశాన నివాసం,గజచర్మం కట్టుకు తిరగడం, అనుచరగణం భుతాలు ఇతణ్ణి చేసుకుని ఏం సుఖపడతావు తల్లీ అని. కాని గౌరి ఒప్పుకోదే,అదేం చిత్రమో!ఇటువంటివాణ్ణి ఎందుకు వెతకడం? :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశావాసము సర్వ విశ్వము , వ్యవస్థీ భూతమై స్థాణులున్ ,
      వాసస్థంబయి జంగమ ప్రకరముల్ భాసించు , మాహేశ్వరా
      వాసంబొందని వస్తు వేదియును నీ బ్రంహాండ భాండంబునన్
      వీసంబైనను లేదు , సర్వ జగముల్ విశ్వేశ్వరాధీనముల్ .

      తొలగించండి


  2. ఒళ్లంత బూడిద భయద!
    యిల్లట నౌ వల్లకాడు యీశుడ వంట
    న్నుల్లము పొంగెను దేవా
    చల్లగ చూడుము కపర్ది! శంకర ! శంభో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ?
    ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు...

    ....అని దేవులపల్లివారు ఎపుడో అడిగారు అయ్యవారిని. ఇప్పుడు మీరిలా అమ్మవారిని - భలే!

    రిప్లయితొలగించండి