సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, మే 2017, బుధవారం

అశ్రు నివాళి

అశ్రు నివాళి
--------------
మమతాను రాగాలు మనిషియై జన్మించి
ధన్యత గాంచిన తన్వి తాను
బంధు జనుల పట్ల బహు ప్రీతి జూపించి
తల లోన నాల్కయౌ తన్వి తాను
పేద సాదల కింత పెట్టు ధర్మ నిరతి
తనరారు చేతల తన్వి తాను
భర్తయు , బిడ్డల పటు ప్రేమ లను బొంది
తనిసి జీవించిన తన్వి తాను

ఇన్ని యిచ్చియు నారోగ్య మీని యీశ్వ
రుని చెయిదమును ప్రశ్నించ పనిగొని  తను
నా  సుభాషిణి  దివికేగె -- నశ్రు జలము
లారవు నయనాల  --  నివాళు లందు కొనుము .

14 కామెంట్‌లు:


  1. శ్రీ లక్కాకుల రాజా రావు గారికి,

    మీకు ఆ దేవదేవుని అనుగ్రహము చల్లగ యుండు గాక

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. రాజారావుగారు,
    రెండురోజులముందే టపా చూశానుగాని..... జాతస్య మరణం ధృవం, చెబుతాం కాని కావలసినవారు కాలం చేసినపుడు బాధ తప్పదు....భగవంతుడే చల్లగా చూడాలి..

    రిప్లయితొలగించండి
  3. దగ్గరివారు ఎవరు పోయినా బాధే కానీ జీవితభాగస్వామిని కోల్పోవడం అంతులేని బాధ. మీకు, మీ కుటుంబానికీ ప్రగాఢ సానుభూతి.

    రిప్లయితొలగించండి
  4. మీ వియోగానికి నేను చింతిస్తున్నాను. మీకు శాంతిని, ధైర్యాన్ని కూర్చమని ఆ దేవదేవునిప్రార్థిస్తూ...

    రిప్లయితొలగించండి
  5. Dear Sir,
    I am not adept in consoling a grieving person.But I sincerely wish you to overcome From the desperation of your life partner.I promise you I can make you smile now and then even though I cannot bring your wife back!
    Regards
    hari.S.babu

    రిప్లయితొలగించండి
  6. అయ్యో మీరు భాగస్వామిని కోల్పోయిన విషయం ఆలస్యంగా తెలిసింది...మన్నించండి.
    ఆవిడకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..
    మీకు మనోధైర్యాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను!

    రిప్లయితొలగించండి