శిరిడిలో నొకసారి కురిసిన జడివాన
పెను తుఫానుగ మారె , జనులుజడిసి
ద్వారకా మాయిని దరిసి సాయినిజేరి
రా యన ' నిలు ' మని యాఙ్ఞ యిడెను ,
ఆగె వర్షము , ... ధుని యగ్నియు నొకపరి
పైకప్పు నంటెను , పరమ యోగి
తగ్గుమని యనగ తలయొగ్గె నగ్నియు
సాయి యోగివరుడు సకల ప్రకృతి ,
పంచభూతాల శాసించు ప్రభలు గలిగి
ప్రకృతి భీభత్సముల నదుపాఙ్ఞ చేసి
ప్రాణులను కాచి రక్షించు ప్రభువయి జన
నతులు నుతు లందుకొంచు నున్నాడు భువిని .
సాయి సద్గురు సన్యాసి సకల ప్రాణి
లోక విహితైషి యోగి ఆలోక మాత్ర
పంచభూతాల నదుపులో నుంచ గల్గు
ఖండయోగ సాధకుడు బ్రహ్మాండ విదుడు .
కాళ్ళు చేతులు మొండెము కంఠము - లను
తుండెములు జేసి ఘనముగా ఖండయోగ
మొప్ప మరల నతికించి యెప్నటి వలె
సాధనము చేసె శ్రీసాయి సద్గురుండు .
కడుపు లోని పేగు లొడపున వెడలించి
బైట శుధ్ధి జేయు పరమ యోగి
యోగ సాధన ఫల ముర్వి హితము కోరి
ధారవోసి - సాయి దైవమయ్యె .
కష్టముల నాడు తోడుగా కదలి వచ్చి
ఆపదలు బాపు ఆ పరమాత్మ వోలె
ప్రజల పక్షాన నిలిచిన పరమ గురుని
దైవమని కొలుతురు సదా ధర్మ విదులు .
20, జనవరి 2017, శుక్రవారం
19, జనవరి 2017, గురువారం
తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా
తప్పేమి దైవాన్ని దశ దిశల దర్శించగా
గొప్పదనమిది భరత ఖండమందనాదిగా/తప్పేమి/
అవ్యయుని రూపాన నారాథ్యులై వెల్గు
దివ్య పురుషులు లేని దిక్కొకటి గలదా /తప్పేమి/
తీరు తీరుల గలరు దివ్యప్రభావులు
యెల్లెడల మనుజుల వెన్నంటి కాపాడగా /తప్పేమి/
కరుణాంతరంగు నీశ్వరుని దర్శింప
పంతమేటికి ఆ భాగవతులా సేవలో /తప్పేమి/
అరుదైన పరమాత్మసురుచిరా మూర్తిని
అరసి కొలువందగును ఆరాధ్యులందెలమితో /తప్పమి/
ఇందిరా రమణునీ హిమశైలజానాధునీ
ఇనకులేశునిగాని ఘనశ్యామునీగాని/తప్పేమి/
తిరుమలేశునిగాని శిరిడిసాయినీగాని
పరమాత్మ రూపాల పరిపరి దర్శించగా/తప్పేమి/
16, జనవరి 2017, సోమవారం
శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము .....
శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/
ఇలలోన కలలోన నెలవు నెలవులలోన
పలుకులో పాటలో పరమాత్మవూ నీవె
నీవు లేనీ చోటు నింగిలో నేలలో
నెలవులే లేవురా శ్రీసాయి రాజా !/ఇల/
పుడమిపై మొలకెత్తి పొలుపుగా వికసించు
రంగు రంగుల పూల రంగులోనూ నీవె /ఇల/
పిందెలై కాయలై ప్రియమార పండిన
మధుర ఫలముల లోని మధువులూ నీవే/ఇల/
జల జలా ప్రవహించు జలరాశియూ నీవె
తళ తళా మెరయు గిరి శిఖరమూ నీవె/ఇల/
వెలుగులు విరజిమ్ము విశ్వాంతరాళాన
వెలుగువై నీవుండ వెరపేమిరా మాకు/ఇల/
దారి నీవేయని దరిజేరినామురా
దారి జూపించి మా దిక్కుగా నిలుమురా/ఇల/
శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/
శ్రీమంగళాకార ! చేరి కొలుతుము నిన్ను
శ్రీచిద్విలాసా ! సిరులివ్వరా మాకు /ఇల/
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/
ఇలలోన కలలోన నెలవు నెలవులలోన
పలుకులో పాటలో పరమాత్మవూ నీవె
నీవు లేనీ చోటు నింగిలో నేలలో
నెలవులే లేవురా శ్రీసాయి రాజా !/ఇల/
పుడమిపై మొలకెత్తి పొలుపుగా వికసించు
రంగు రంగుల పూల రంగులోనూ నీవె /ఇల/
పిందెలై కాయలై ప్రియమార పండిన
మధుర ఫలముల లోని మధువులూ నీవే/ఇల/
జల జలా ప్రవహించు జలరాశియూ నీవె
తళ తళా మెరయు గిరి శిఖరమూ నీవె/ఇల/
వెలుగులు విరజిమ్ము విశ్వాంతరాళాన
వెలుగువై నీవుండ వెరపేమిరా మాకు/ఇల/
దారి నీవేయని దరిజేరినామురా
దారి జూపించి మా దిక్కుగా నిలుమురా/ఇల/
శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/
శ్రీమంగళాకార ! చేరి కొలుతుము నిన్ను
శ్రీచిద్విలాసా ! సిరులివ్వరా మాకు /ఇల/
15, జనవరి 2017, ఆదివారం
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా !
విని తరించితిమి నీ విమల బోధల సుధలు
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా
నిన్ను నమ్మిన వాళ్ళు నిజ జీవితాలలో
ఎదురైన కష్టాల నెదిరి గట్టెక్కుదురు /విని/
కల్మషము లేని నీ కరుణా కటాక్షాల
తడిసిన యెల్లరు తరియించ గలరు /విని/
చేతులు జోడించి నీ చెంత జేరిన వాళ్ళ
భద్రతల బాధ్యతలు భరియింతువీవు /విని/
మది మందిరములలో నిను నిలిపి నిశ్చింత
నెమ్మది హాయిగా నిదుర వోదుమురా /విని/
ప్రణుతింతు ప్రణుతింతు ప్రభు సాయి నాధా
నిన్ను నమ్మిన వాళ్ళు నిజ జీవితాలలో
ఎదురైన కష్టాల నెదిరి గట్టెక్కుదురు /విని/
కల్మషము లేని నీ కరుణా కటాక్షాల
తడిసిన యెల్లరు తరియించ గలరు /విని/
చేతులు జోడించి నీ చెంత జేరిన వాళ్ళ
భద్రతల బాధ్యతలు భరియింతువీవు /విని/
మది మందిరములలో నిను నిలిపి నిశ్చింత
నెమ్మది హాయిగా నిదుర వోదుమురా /విని/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)