సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

1, జనవరి 2018, సోమవారం

ఆకాంక్ష

భారతీయతకును పద్దెనిమిదికిని
విడని బంధమేదొ వినగ నగును
ధర్మ రక్ష కొఱకు తరచుగా నీసంఖ్య
తారస పడె నాటి తరము లందు .

నేడు పద్దెనిమిది నియతమై వచ్చెను
చెలగి ధర్మ రక్ష చేయు కొఱకొ
చెడును గెలుచి మంచి చేరువై జనులెల్ల
భద్ర మైన బ్రతుకు బ్రతుకు కొఱకొ .

గడచిన వత్సర మంతయు
కడగండ్లను బడిరి జనులు ఘనుల వలన , ఆ
చిడి ముడి పాట్లిక ముందున
విడిపోవునొ , కొత్త పాట్లు విడుదల యగునో ?

పాలకులు ప్రజల పక్షము
మేలు దలచి తగు విథము సమీక్షలతో చ
ట్టాలొనరించి హితమ్ముగ
పాలించుచు ప్రజల మెప్పు బడయంగ నగున్

ముంద టేడాది వలె గాక , ముదము గూర్చ
నవ వసంతము మన భూమి నవతరించి
సకల జనముల , సంతోష సమధికముగ ,
జీవ నానంద పథముల జేర్చు గాత !

2 కామెంట్‌లు:



  1. నూతన వత్సర మండీ !
    చేతము సరికొత్త బాస చేకూర భళా
    జోతలు మనకెల్లరికిన్
    సాతము భువిలో నెలకొని సారంగమవన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నూతన వత్సర మండీ !
      చేతులు కలుపుదము రండి చేతో ముదమౌ
      పాతను కొత్తను కలుపుక
      బోతము సరి కొత్త మార్గ స్ఫూర్తి రగిల్చన్ .

      తొలగించండి