సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జనవరి 2018, సోమవారం

నమో సూర్యనారాయణా


చలికి గిజ గిజలాడు చంచల పుడమిని
తన కవోష్ణ కిరణ బాహులను పొదివి ర
మించు సూర్యనారాయణు మించు ప్రేమ
కథకు మకర సంక్రమణ సాక్ష్యమ్ము సుమ్ము .

ఉత్తరాయణ పుణ్య భానూర్థ్వ కిరణ
జనిత జీవమ్ములంది ప్రజ్జ్వలత పొంది
భూమిపై జీవజాలమ్ము స్ఫూర్తి నొందు
శుభ సమయ సంక్రమణ మిది , శోభనమ్ము .

2 కామెంట్‌లు:

  1. బాగుంది మాస్టారూ. లోకానికి ఎంతో మేలు చేసే సూర్యుడిని ఎంత స్తుతించినా తక్కువే.

    నాకిష్టమైన ఈ నాలుగు పదాలు గుర్తొచ్చాయి.

    "శ్రీ సూర్యనారాయణా
    వేదపారాయణా
    లోక రక్షామణీ
    దైవ చూడామణీ
    .......
    ......."

    చిన్నప్పుడు ఈ స్తోత్రం ఆల్ ఇండియా రేడియోలో వస్తుండేది.

    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములు సార్ ,
    ఆ లోకబాంధవుడే ప్రత్యక్ష నారాయణుడు కదా !
    మీరన్నది యథార్థము .

    రిప్లయితొలగించండి